బేబీ సినిమా రివ్యూ

గత కొన్ని రోజులుగా బేబీ సినిమా పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్ గా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎస్ కె యన్ నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయ్యింది.

సాయి రాజేష్ హృదయ కాలేయం డైరెక్షన్ తర్వాత కలర్ ఫోటో సినిమాకి నిర్మాత మరియు స్టోరీ రైటర్ గా వ్యవహరించడం జరిగింది ఆ సినిమా కి ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా వరించింది. ఈరోజు విడుదలైన బేబీ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ లో చూద్దాం.

Baby movie review
Baby movie review


కథ విషయానికి వస్తే

ఆనంద్ (ఆనంద్ దేవర కొండ) మరియు వైష్ణవి ( వైష్ణవి చైతన్య) స్కూలింగ్ డేస్ నుండి ప్రేమిచుకుంటూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు అలా ఉండగా పదో తరగతి పరీక్షలు రావడం ఆనంద్ ఆ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం ఆటో కొనుక్కుని తొలుకోవడం వైష్ణవి ఏమో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం జరుగుతుంది.

ఇద్దరు చట్టపట్టాలు ఏసుకుని తిరుగుతూ ఉండగా వైష్ణవి పోష్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం అక్కడ వీరాజ్ తో (వీరాజ్ అశ్విన్) స్నేహం ఏర్పడడం జరుగుతుంది అతను గిఫ్ట్స్ కు లైఫ్ స్టైల్ కు అట్ట్రాక్ట్ అవుతుంది . వీరాజ్ అశ్విన్ ప్రేమ ప్రపోసల్ తీసుకురావడం మరియు అక్కడ ఉన్న చెడు స్నేహితుల సలహాలతో ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుని కన్ఫ్యూషన్లోకి వెళ్ళింది . వీరాజ్ ప్రపోసాల్ ఏక్సిప్టు చేసిందా లేదా ఇది తెలిసిన ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది థియేటర్ లో చూడాల్సిందే.

Baby movie review
Baby movie review

విశ్లేషణ
ప్రస్తుతం మన సమాజంలో ఉన్న యువత చెడు స్నేహాలు పరిపక్వత లేని ప్రేమలు ఆ ప్రేమలు వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి అని దర్శకుడు సాయి రాజేష్ కళ్ళకు అద్దం కట్టినట్టు చూపించాడు. యూత్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి . ఓపెన్ మైండ్ తో చూస్తే ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవుతారు. ప్రేమిస్తే, RX 100 ఛాయలు ఉన్నప్పటికీ ఇప్పటి సిట్యుయేషన్స్ తగ్గట్టుగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు.

దర్శకుడు సాయి రాజేష్ హృదయకాలేయం తీసినప్పుడు అదొక కమర్షియల్ సినిమాల మీద ఒక మంచి సెటైర్ అని ఓపెన్ మైండ్ తో కొంతమంది ఆక్సిప్ట్ చేయలేకపోయారు కానీ అది ఒక మంచి ప్రయోగం. అలాగే ఈ బేబీ కూడా పరిపక్వత (immature ) లేని యువత మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయి ఎలా గొడవపడతారు బయట ఎలా జరుగుతాయో ఆలా చూపించాడు ఈ సినిమాని ఓపెన్ మైండ్ చూసి తప్పకుండా ఆక్సిప్ట్ చెయ్యాలి.

Baby movie review
Baby movie review

నటీనటుల పెర్ఫార్మన్స్

ఆనంద్ దేవరకొండ అద్భుతమైన నటనను కనబరిచాడు. వైష్ణవి చైతన్య యూట్యూబ్ వెబ్ సిరీస్, సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లు చేసింది ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో అదరకొట్టిందని చెప్పవచ్చు. విరాజ్ అశ్విన్ కూడా నటించాడు.

హైలైట్స్

యాక్టర్స్ పెర్ఫార్మన్స్
విజయ్ బుల్గేనియన్ మ్యూజిక్
సాయి రాజేష్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి